ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ పవన్‌కళ్యాణ్ గారు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ గారిని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ బందర్ రోడ్డులోని రాజ్‌భవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్‌ని కలసిన శ్రీ పవన్‌కళ్యాణ్ గారు నూతన ఆంధ్రప్రదేశ్ కు తొలి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ బిశ్వభూషన్ హరిచందన్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినందున మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలసినట్టు తెలిపారు. శ్రీ పవన్‌కళ్యాణ్ గారితో పాటు గవర్నర్‌ని కలసిన వారిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, ప్యాక్ సభ్యులు శ్రీ నాగబాబు, శ్రీ పాలవలస యశస్విని, శ్రీ మనుక్రాంత్‌రెడ్డి, పార్టీ లీగల్‌సెల్ కోఆర్డినేటర్ శ్రీ ప్రతాప్ తదితరులు ఉన్నారు.