మీకు అండగా ఉంటా అని హామీ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్
మీకు అండగా ఉంటా అని హామీ ఇస్తున్నాను - పవన్ కళ్యాణ్
మూడు జిల్లాలు తిరిగి నేను ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకున్నాను, ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నాను
ఏ యువతరమైతే వెనుకబాటుకు గురయ్యారో, ఎందుకు వెనక్కు నెట్టబడిందో, పొట్ట చేతపట్టుకొని ఎందుకు వలసలు పోతున్నారో నేను చెప్పేకంటే చలం గారు లాంటి మేధావి చెప్తే ఇంకా అర్థవంతంగా ఉంటుంది .
మన ప్రాంతానికి చెందిన 23 వెనుకబడిన కులాలను రిజర్వేషన్లు నుంచి తెలంగాణాలో తొలగిస్తే ఇక్కడి నుండి వెళ్ళాక తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో మాట్లాడతా అన్నారు ముఖ్న పవన్ కళ్యాణ్ - ఉత్తరాంధ్ర మేధావి శ్రీ చలం గారు .
మన ఉత్తరాంధ్ర వెనుకబాటు నుంచి బయట పడేయాలన్నా, మన ఉపాధి అవకాశాలను తిరిగి తీసుకురావాలన్న, భూ దోపిడీలు అరికట్టాలన్నా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది - ఉత్తరాంధ్ర మేధావి శ్రీ చలం గారు.
వైజాగ్ రోడ్లను చూసి ఉత్తరాంధ్ర మొత్తం ఇలానే ఉంటుంది అనుకుంటే పొరపాటు, ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన వారిని ఇక్కడి రోడ్ల మీద తిప్పి ఆహా అనుకుంటారు, ఒకసారి మన కోట వీధుల వెంట తిప్పితే దుర్గంధంతో అసహ్యించుకుంటారు.పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టిన మొదటి దశ పర్యటన ఈరోజు బీచ్ వద్ద ముగుస్తుంది, నేను తిరిగి రాజకీయాల్లోకి రావటానికి ముఖ్య కారణం ఎప్పుడు పర్క్జలకు సంబంధం లేకుండా నాయకులు తీసుకున్న నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు.
తెలంగాణ నాయకులు చెప్పే దోపిడిలో ఆంధ్ర ప్రజలకు సంబంధం లేదు, చంద్రబాబు గారు 9 ఏళ్ళు, కాంగ్రెస్ 10 ఏళ్ళ పరిపాలనలో జరిగిన దోపిడీకి ప్రజలు , యువత నష్టపోయారు .
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు వారి నాయకుడు ఒకడు నా రూమ్ తలుపు అనుమతి లేకుండా తోసుకొచ్చి నాతో సినిమా చేయాలని అన్నాడు, ఇది వారి నైజం, మీరు ఫ్యాక్షన్ లీడర్లయితే పవన్ కళ్యాణ్ బయపడతాడా.
బాలు సినిమా టైమ్ లో ఒక సర్జరీ జరిగి నేను ఉంటే ఒక IAS అధికారి వచ్చి మీ మీద , మీ అన్నయ్య గారి మీద దాడులు చేస్తాం అన్నారు, మేము ఏం తప్పు చేసాం, ఎందుకు అని అడిగితే మీ అన్నయ్య రాజకీయాల్లోకి వస్తున్నాడు గా భయపెట్టడానికి అన్నాడు.
అన్నదమ్ముల మద్య చిచ్చు పెడితే కష్టమైనా భరించాం.నిర్లక్ష్య ధోరణితో పంపకాలు జరిపి రాష్ట్రాన్ని చీల్చితే మౌనంగా సహించాం. కులమత ప్రాంతీయ విబేధాలతో దోచుకుంటుంటే తప్పక ఎదిరిస్తాం.కంచె చేను మేసిన రీతిగా పాలకుల ప్రవర్తన ఉంటే నవసమాజ నిర్మాణానికై నినదిస్తాం.
16 సంవత్సరాల మా బిడ్డను ఢిల్లీ వరకు చూపించి రియాలిటీ షో చేసి మా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు
నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని,
ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ కి ఎం తెలుసు అని వాగుతారు, మరి మీకేం తెలుసురా, మీకేం సమస్యలు తెలుసురా, ఉత్తరాంధ్ర కష్టాలు ఎం తెలుసురా మీకు , ఏం చదువుకున్నారు రా మీరు
చేసిన తప్పులు మళ్ళీ చేయరేమో అనే ఉద్దేశ్యంతో ప్రజారాజ్యం అప్పుడు మోసం చేసిన నాయకులను కూడా నేను 2014 లో గెలిపించాను.
ఆరోజు చంద్రబాబు గారు కాంగ్రెస్ వారికి బయపడితే మీకేం భయం లేదు నేనున్నాను అని వారికి ధైర్యం ఇచ్చి గెలిపించాను, పిరికి వాళ్ళను నేను ధైర్యమిచ్చి గెలిపిస్తే ఈరోజు మమ్మల్నే అంటున్నారు
చంద్రబాబు గారు మా ఆఫీస్ కి వచ్చి మద్దతు తీసుకొని వెళ్లి గెలిచిన తరువాత ప్రమాణ స్వీకారానికి పిలిచారు అంతే మళ్ళీ ఇప్పుడు ఆయనకు పవన్ కళ్యాణ్ గుర్తు రాలేదు.
లోకేష్ గారి గురించి ఏం చెప్పాలి, ముఖ్యమంత్రి గారి కొడుకు అయితే మీరు మా నెత్తి మీదకు ఎక్కి తొక్కేస్తారా, మేము తొక్కించుకోవాలా, లక్షలు ఎకరాలు దొబ్బేస్తోంటే చూస్తూ ఎలా కూర్చుంటాం
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్ధ రా అంటే ఊయక్తి అని అన్నా అని అంటారు ఈ దద్దమ్మలు, ఒరేయ్ చవట దద్దమ్మల్లారా అది సంస్థ రా వ్యక్తికాడు రా
ముందు లోకేష్ గారు,తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, జగన్ గారు, ఇక ఈ పవన్ కళ్యాణ్ ఎవరి మనుషులు వద్దు మనం నలుగురుమే కలిసి 80 మైళ్ళ వేగంతో దూసుకొచ్చే ట్రైన్ లాంటి మోడీ గారిని ఆగు అని ఆపుదాం సరేనా, నాకు దమ్ముంది మరి మీకు ఉందా
రైల్వే జోన్ కావాలంటే నలుగురు వ్యక్తులు చాలబ్బా, ముందు లోకేష్ గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు, తర్వాత జగన్ గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. రండి కూర్చుందాం! రైళ్ళని ఆపుదాం!!
మనమే వెళదాం , ప్రజలు వద్దు, వారి జీవితాలు, ఉద్యోగాలు నాశనం అవటం నాకిష్టం లేదు, నేను జైలు కి వెళ్ళటానికి రెడీ ముఖ్యమంత్రి గారు, జగన్ గారు, లోకేష్ గారు గంగమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా ట
ఇక్కడే దీక్ష చేద్దాం దమ్ముందా
రైల్వే జోన్ కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే అవంతి శ్రీనివాస్ గారు జోన్ లేదు గీన్ లేదు అని, ఎంపీలు బరువు తగ్గటానికి దీక్షలు చేస్తామని ఎటకారం చేస్తారు
పెద్దలు అశోక్ గజపతి రాజు గారు అంటే నాకు గౌరవం, ఆయనకు నేను ప్రచారం చేసాను, ఆయన అవి మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఎవడో నాకు తెలియదు అని అన్నాడు, నేను శ్రీకాకుళంలో దీక్ష చేస్తుంటే విశాఖలో దీక్ష అంటారు, నేను విశాఖ లో దీక్ష ఎక్కడ చేశా సామీ
నేను అశోక్ గజపతి రాజు గారినో, చంద్రబాబు గారినో ఒక మాట అంటే అది వ్యక్తిని అన్నట్లు తప్ప కులాన్ని అనటం కాదు, ఇలా కులానికి అంటగట్టి విద్వేషాలు రేకెత్తించవద్దు
ముఖ్యమంత్రి గారు నాడు నాతో బాక్సైట్ తవ్వకాలు జరపమని చెప్పి ఈరోజు అరకు పరిసర గ్రామాల్లో విచక్షణా రహితంగా త్రవ్విస్తున్నాడు ముఖ్యమంత్రి గారు
ఉద్దానం అంటే ఉద్యానవనం , కేరళ లాంటి శ్రీకాకుళం, ఉద్దానం ప్రాంతాల్ని అభివృద్ధి చేయకుండా ఏదేదో మాట్లాడుతారు
లోకేష్ గారు మీకు సైకిల్ త్రొక్కడం బాగా ఇష్టమని నాకు తెలుసు, మీరు ఉత్తరాంధ్ర మొత్తం సైకిలు యాత్ర చేయండి, మెల్లగా ఢిల్లీ వెళ్లి మోదీ గారి ముందు సైకిల్ త్రోక్కండి ఎలాగో మీ పార్టీ గుర్తు కూడా అదే
ఇంతమంది నాయకులున్నారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాదరావు గారు, గంటా గారు ఇంతమంది ఉన్నారు ఏ ఉత్తరాంధ్ర వెనుక బడిన కులాలను రిజర్వేషన్లు తీసేయకండి అని కేసీఆర్ గారిని అడగచ్చు కదా
ఉత్తరాంధ్ర లో సుజల స్రవంతి పధకం అని చెప్పి 2714 కోట్లు కేటాయించారు, 2019కి నీళ్లు ఇస్తామంతున్నారు అసలు ఏం చేస్తున్నారు మీరు, లక్షల ఎకరాల భూమి తీసుకుంటున్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేకపోతున్నారు
ఈ ఆంధ్రా నాయకుల్లో ఒక్కరైనా వెళ్లి తెలంగాణలో తిరగగలరా నాలాగా? తిరగలేరు ఎందుకంటే నేను తెలంగాణలో దోపిడీకి పాలుపడలేదు, గుండెల్లో పెట్టుకున్నాను నేను తెలంగాణని.
తినటానికి తిండి కూడా లేక గుడికి వెళ్లి ప్రసాదం టి ఈ బ్రతుకుతున్న ఒకావిడ నిన్న నా దగ్గరకు వచ్చింది, కళ్ళు గుంతలు పడిపోయి ఉన్నాయి, మరి ముఖ్యమంత్రి గారు, జగన్ గారు మీకు ఇవి కనపడవా
మీకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే నాయి బ్రాహ్మణులను బెదిరించారు మీ కంటే దుర్మాగులా వారు, ఒక 5 రూపాయలు పెంచండి అంటే బెదిరిస్తారా
పెందుర్తి ఎమ్మెల్యే అంటున్నాడు పవన్ ఒక సినిమా నటుడు ఎం తెలీదు అని, నీ పేరు కూడా తెలీదు, నీకు నీ కొడుకుకి చెప్తున్నా మీరు ఉన్న పార్టీ ఒక నటుడు పెట్టిందే అని తెలుసుకోండి రా వాజమ్మల్లారా
ముఖ్యమంత్రి గారు నేను పెద్ద మాదిగ అని చెప్పుకుంటారు కానీ మాదిగ అన్నదమ్ములకు ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు
ముఖ్యమంత్రి గారు అవినీతి ఎక్కడుంది అని అంటారు, మీ ఆఫీస్ లో ఉన్న అసిస్టెంట్ అకౌంట్ రూపంలో లక్షల రూపాయలులంచాలు తీసుకుంటున్నాడు , మీ కుమారుడు అంగన్ వాడి టీచర్ల దగ్గర 5 లక్షలు లంచం తీసుకుంటాడు దీనికేమంటారు , మీరు నా తల్లిని దూషించేలా చేశారు, 6 నెలలునన్ను నా వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు, ఇంకొకసారి అధికారంలోకి వస్తే వీరు మన అమ్మలు, అక్కల్ని తిట్టే స్థాయికి వస్తారు
ముఖ్యమంత్రి గారు వారి పార్టీకి ఎప్పుడు మనం ఊడిగం చేస్తూ, గులాంగిరి చేస్తూ ఉండాలి, కాదు అని వారి తప్పులను ఎత్తి చూపితే మీరు మన ఇంట్లోవారిని అడ్డమైన మాటలతో తిట్టిస్తారు
ఏమైనా మాట్లాడితే నేను విప్లవం రేకెత్తిస్తున్నాను, రెచ్చగొడుతున్నాను అని అంటున్నారు, అసలు మీరు అన్యాయం చేస్తుంటే ఇలా కాక ఇంకెలా మాట్లాడుతాం
ముఖ్యమంత్రి గారు మీరు డ్రామాలకు, పేపర్ స్టేట్మెంట్ లకు తప్ప ఎందుకు పనికిరారు
ఆఖరుకు వైజాగ్ గ్రంధాలయం స్థలాన్ని కూడా 4 ఎకరాలు ప్రత్యుష అనే గంటా గారి కంపెనీ కబ్జా చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా
6 లక్షల మంది మత్స్యకారులు నివసిస్తున్న ప్రాంతం, గంగమ్మ తల్లి పూజ చేయటానికి కారణం, ఒక పెద్దావిడ అణా మాటలు, మాకు ఈ బోటు ఇల్లు, ఇక్కదేవంట, ఇక్కడే పడక అని చెప్పింది అందుకే వారికి అండగా నిలబడటానికి నేను గంగమ్మ తల్లి అండ కోసం పూజతో మొదలెట్టాను
తెలుగుదేశం వారిని కనుక మనం వచ్చే ఎన్నికలలో ఓడించకపోతే రాబోయే కాలంలో ఈ డాల్ఫీన్ నోస్ కొండ, ఈ వాతావరణం కూడా లేకుండా చేస్తారు
మన ప్రాంతాలను మనం రక్షించుకోలేకపోతే, స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వైరుధ్యా భావాలు, విద్వేషాలు వస్తాయి
ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రాంతంలో 9 అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఎంఓయులు చేసుకున్నారు, అందులో ఏ ఒక్కటి ఏర్పాటు చేసినా అది మొత్తం తీరా ప్రాంతానికి, దేశ భద్రతకు ముప్పు
ముఖ్న ఉత్తరాంధ్ర లొనే కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు, బయో కెమికల్ ఫ్యాక్టరీలు, అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంత అందమైన ప్రదేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు.
నేను నా జీవితంలో నా అన్నయ్యతో సహా ఎవరి దగ్గరా ఏది ఆశించలేదు, ఒక్క దర్శకుడిని కూడా అవకాశం అడగలేదు
మీరందరు వోట్ రిజిస్టర్ చేసుకోండి, మార్పును తీసుకు రావటానికి జనసేన కు అండగా నిలబడండి, సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం
మా అన్నయ్య నాకు గురువు, దైవం అన్నీ, అలాంటిడినేను నా దైవానికి ఎదురెళ్లి నేను మీకు సపోర్ట్ చేసాను, తేడా వస్తే ఎక్కడిదాక అయినా వెళ్లే మనిషిని మీకు బయపడను.
గంగమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నాను, నేను మీ ఇంట్లో ఒకడిని, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించటానికి, మీ వెనుకబాటుతనాన్ని తరిమేయటానికి మీకు అండగా ఉంటా అని హామీ ఇస్తున్నాను
అరకు దగ్గర కొందరు మహిళలు బిందెలతో రోడ్ల మీద నన్ను ఆపి 7 కి.మీ దూరం నీళ్ల దగ్గరకు జారిపోయే మట్టిలో తీసుకెళ్లారు, వారి కష్టాలు చూసాను, పడిపోరా అమ్మా అని అడిగితే మా పిల్లలు చెప్పారయ్యా నీ పెద్దకొడుకు కష్టాలు తీర్చేందుకు వస్తున్నాడమ్మ అన్నారు
