BJP-JANASENA will vigorously resist if the YCP continues its anti-Hindu policies
అంతర్వేది రథం విధ్వంసం నీ పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు గారు
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు,అమలాపురం జిల్లా అధ్యక్షులు అయ్యాజి వేమా మరియు ఇతర జిల్లా ముఖ్య నాయకులతో కలిసి అంతర్వేది సంఘటనాస్థలానికి చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించి ,ఆలయ అధికారులు,రెవెన్యూమరియు పోలీసు అధికారులతో మాట్లాడి నిందితులను వెంటనే శిక్షించాలని కోరారు.అంతర్వేది రథం విధ్వంసం నీ పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు గారు కి స్వాగతం పలుకుతున్న రాజోలు నియోజకవర్గం బిజెపి - జనసేన నాయకులు మరియు కార్యకర్తలు.
చలో అంతర్వేది కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారితో వెళ్లకుండా 40 మందికి పైగా బిజెపి నాయకులను నిన్న రాత్రి నుండి గోదావరి జిల్లాల్లో పోలీసులు గృహనిర్బంధం చేశారు. గత టిడిపి ప్రభుత్వం లాగానే హిందూ వ్యతిరేక విధానాలను వైసిపి కొనసాగిస్తే బిజెపి - జనసేన తీవ్రంగా ప్రతిఘటిస్తుందిి.
ఆంతర్వేది ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన వారిపై ఐ. పి.సి 143,448,427,125a,295సెక్షన్ల క్రింద అరెస్టు చేసి రాజోలు కోర్టుకి తరలించిన నేపథ్యంలో రాజోలు కోర్టు ప్రాంగణంలో ఆందోళనకారులను స్వయంగా పరామర్శించడం జరిగింది ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించు కొని, విడిచిపెట్టాలి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.
అంతర్వేది రథం దహనం ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేసిన బిజెపి - జనసేన మరియు వి హెచ్ పి నాయకులను అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ MRO గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది.

