ఈరోజు అంతర్వేది రధం ధ్వంసం విషయంలో బిజెపి-జనసేన సంయుక్తంగా చేసిన నిరసన దీక్ష విజయవంతం అవడం మరియు "ఛలో అంతర్వేది" అని పిలుపు ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం ఉలిక్కిపడి అంతర్వేది ఘటన విచారణను సిబిఐకి అప్పజెప్పింది. ఇది ఖచ్చితంగా హిందూ బంధువులందరి విజయం.

ఈరోజు నిరసన దీక్ష చేసిన బిజెపి -జనసేన కార్యకర్తలు, హైందవ ధర్మ పరిరక్షకులు అందరికి నా హృదయపూర్వక అభినందనలు. వైసీపీ మరియు టీడీపీ చేసే హిందూ వ్యతిరేక విధానాలను మా బిజెపి -జనసేన కూటమి ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  గారి ప్రభుత్వం అంతర్వేది ఘటనలో అక్రమంగా అరెస్ట్ చేసిన హిందువులందరిని వెంటనే విడుదల చేయాలని, వారిమీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలా జరిగేంతవరకు మేము నిరసన కార్యక్రమాలు ఆపము.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన చర్యలకు కఠినంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు హిందూ ధార్మిక సంస్థలు చేసే నిరసన కార్యక్రమాలకు బిజెపి నైతిక మద్దతు ఇస్తుంది దోషులకు శిక్ష పడేంతవరకూ బిజెపి-జనసేన పార్టీల ద్వయం నిరంతరం పోరాటాన్ని నిర్మాణం చేస్తూనేవుంటాం..

రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి సంఘటన జరిగిన తీరు మరియు తరువాత జరిగిన పరిణామ క్రమాన్ని పెద్దలకు తెలియజేస్తాం ఈలోగా త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి వినతిపత్రం అందజేస్తాం. (2/2)

#SaveHinduTemples


Popular posts from this blog

Massive Drone Strikes Rock Ryazan: Explosions Hit Oil Refinery and Airbase Overnight

Passenger Jet Collides Midair with Helicopter Near Washington, Crashes into Potomac River

Pragyan Agra’s Hot Video: The Viral Sensation Taking Social Media by Storm