Janasena president Shri Pawan Kalyan said that culture and agriculture are one and the same in India

భారతదేశంలో కల్చర్, అగ్రికల్చర్ రెండు ఒక్కటే అన్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్

 
మన జీవన విధానంలో, సంస్కృతిలో వ్యవసాయ విధానాలు కూడా భాగమే అన్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. కాలానుగుణంగా పంటలు ఉంటాయి. ఆ పంట చేతికి వచ్చే వేళలోనే పండుగలు చేసుకొంటామన్నారు.

మన కల్చర్... అగ్రికల్చర్ ఒకటి అనే భావనను పెంచుకోవాలని సూచించారు అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన చేపట్టామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జనసేన చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై ప్రకృతి రైతు శ్రీ విజయ రామ్ గారు సూచనలు సలహాలు ఇస్తున్నారు.

శ్రీ విజయరామ్ మాట్లాడుతూ “భగవంతుడు అందరికంటే పెద్ద సైంటిస్టు అని, మానవ శరీరంలోని అవయవాల అవసరాలకు తగ్గట్టు విత్తనాలు డిజైన్ చేశాడు. భగవంతుడి సృష్టి చాలా అద్భుతం. మన ఊహకు మాత్రం అందదు.మన శరీరంలో అవయవాల అవసరాలకు తగట్టు ఆహారం ఉంది.

మహాభారతం కాలంలో 6 లక్షల విత్తనాలు ఉన్నాయని విజ్ఞులు చెబుతారు. కేవలం ఆకలేస్తే పండించుకొని తినడానికి ఇన్ని లక్షల విత్తనాలు సృష్టించలేదు.మనిషికి భోజనమే ఔషధం కనుక ఇన్ని లక్షల రకాల విత్తనాలను సృష్టించాడు.

మానవుడు కావలసినవన్ని సృష్టించాకే భూమిపై మనిషిని పుట్టించాడు. మనిషిది భూమి మీద అతిధి పాత్ర. మన ముందు చాలా మంది వచ్చారు... తర్వాత కూడా చాలా మంది వస్తారు.

దేశంలో మానవ వనరులకు కొదవ లేదు.
కోట్లాది మంది జనాభా ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా పొలాల్లో కలుపు తీయడానికి మనుషులు లేకుండాపోయారు.

దీంతో కలుపు తీయడానికి భయంకరమైన మందులు వాడుతున్నాం. ఏ పంటను వేసినా ఈ కలుపు మందుల ప్రభావం లివర్, బ్రెయిన్ మీద పడి క్యాన్సర్ కు గురవుతున్నాం.

ముఖ్యంగా మినుములు పండించడానికి మందులు ఎక్కువగా వాడుతున్నారు. అని మనం తినే ఇడ్లీ లో ఆ కలుపు మందుల ప్రభావం ఉంటోంది.కలుపు మందు వాడకుండా పంట పండించడం పాలేకర్ విధానంలో చాలా సులభం.

ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఉపాధి హామీ వంటి పథకాలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతుకు లాభం చేకూరుతుంది.ఉత్పత్తి పెరుగుతుంది.వ్యవసాయ కూలీలకు ఇస్తున్న రూ.300 రూపాయల్లో ప్రభుత్వం రూ.150, రైతు రూ.150 భరించవచ్చు.రైతే దగ్గరుండి వ్యవసాయ పనులు పూర్తి చేయించుకొనే అవకాశం వస్తుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది .

అధిక దిగుబడులవైపు పరుగులు పెట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాం. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో దేశీయ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.ఒడిశా, ఛత్తీస్ గడ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏ చిన్న రైతు దగ్గరకు వెళ్లిన రకాల దేశీయ విత్తనాలు లభ్యమవుతాయి. ఇప్పటికీ ఒడిశాలోని పూరి జగన్నాథ్ స్వామి ఆలయంలో రోజుకు మూడు రకాల వరి విత్తనాలతో భోజనం పెడతారు.

రేపు మళ్లీ మరో మూడు రకాల విత్తనాలతో భోజనం వడ్డిస్తారు.ఇలా సంవత్సరంలో దాదాపు వెయ్యి రకాల విత్తనాలు భోజనం పెడతారు. ఇప్పటికీ దేశంలో 5 వేల రకాల విత్తనాలు బతికే ఉన్నాయి.

కొన్ని దేశవాళీ వరి విత్తనాలతో పండించిన ఆహారం తీసుకొనే మహిళల్లో సంతాన సాఫల్యం కలిగే అవకాశం ఉంది. ఇలాంటివి అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో సైంటిస్టులు చెప్పరు" అన్నారు.

Popular posts from this blog

Massive Drone Strikes Rock Ryazan: Explosions Hit Oil Refinery and Airbase Overnight

Passenger Jet Collides Midair with Helicopter Near Washington, Crashes into Potomac River

Pragyan Agra’s Hot Video: The Viral Sensation Taking Social Media by Storm