Somuveerraju asked the police to punish Minister Kodali Nani for his insulting remarks on Hindu deities

Shri Somuveerraju asked the police to punish Minister Kodali Nani for his insulting remarks on Hindus


హిందూ దేవుళ్ళ పై మంత్రి కొడాలి నాని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై కఠిన శిక్ష వేయాలని పోలీసు వారిని కోరారు శ్రీ సోమవిరాజు

మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు(నాని) హిందువుల మనోభావాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల పై కేసులు నమోదు చేయాలని పోలీసు వారిని కోరారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవిరాజు

మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు(నాని) గారి వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్త నిరసనలలో భాగంగా ఈ రోజు విజయవాడలో ఆంజనేయస్వామి వారి ఆలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవిరాజు గారు,రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి మంచి బుద్ధులు ప్రసాదించమని స్వామి వారికి వినతిపత్రం అందచేశారు.

హిందువుల మనోభావాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలని బిజెపి ఖండిస్తున్నదని, ఆచారాలు, ధర్మకార్యాలను ప్రశ్నించే వింత పోకడలను మానుకోవాలని డిమాండ్ చేశారు.స్థానిక పోలీస్ స్టేషన్ లో మంత్రిగారి వ్యాఖ్యలపై ఐ.పి.సి 295,295A,153A సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేయాలని పోలీసు వారిని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి హిందూధర్మం మీద మరియు హిందూ దేవుళ్ళపై వ్యాఖ్యలు చేసిన వారు ఎంతటి వారైనా కఠిన శిక్ష వేయాలని,మున్ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.లేని పక్షంలో బిజెపి ఒక కార్యాచరణ విడుదల చేస్తుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాము.

Popular posts from this blog

Massive Drone Strikes Rock Ryazan: Explosions Hit Oil Refinery and Airbase Overnight

Passenger Jet Collides Midair with Helicopter Near Washington, Crashes into Potomac River

Pragyan Agra’s Hot Video: The Viral Sensation Taking Social Media by Storm