హక్కుల సాధన కోసం సమష్టిగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు
హక్కుల సాధన కోసం సమష్టిగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర తరహాలో ఏపీలోనూ రైతులు తమ హక్కుల సాధన కోసం సమష్టిగా ఉద్యమించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. పోరాటాన్ని రాజధాని ప్రాంతమైన ఉండవల్లి నుంచే మొదలు పెడతామన్నారు. ఇందుకోసం అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులతో జేఏసీ ఏర్పాటు చేద్దామన్నారు. శుక్రవారం ఉదయం అమరావతి, కాకినాడ సెజ్, పోలవరం, సోంపేట, వంశధార ప్రాజెక్టులు, భావనపాడు పోర్టు, కొవ్వాడ అణు విద్యుత్కేంద్రం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూ నిర్వాసితులతో కలిసి విశాఖలో ఏపీ భూ నిర్వాసితుల జనసభ నిర్వహించారు. ఈ సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ పురాణాల్లో హిరణ్యకశ్యపుడి మాదిరిగానే నేటి పాలకులు భూములు లాక్కొని రైతును, రైతు కుటుంబాలను రోడ్డు పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాజధాని కన్పించదు. పరిశ్రమలు రావు. ఉద్యోగాలు ఇవ్వరు. కానీ వాటి పేరు చెప్పి వేల ఎకరాలను బలవంతంగా లాక్కుంటూ.. రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని’ ఆరోపించారు. విశాఖలో ఇన్నో సొల్యూషన్స్, ప్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు ఎకరా రూ.35 లక్షల...