సినీ తారలు అంతా చిరంజీవి ఏర్పాటుచేసిన రీయూనియన్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు.
80వ దశకంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినీ తారలు అంతా చిరంజీవి ఏర్పాటుచేసిన రీయూనియన్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. 1980ల నాటి సినీ తారలు ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒక చోట కలిసి సందడి చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, రీయూనియన్‌లో పాల్గొన్న సినీతారలంతా కలిసి తీసుకున్న ఫొటో తాజాగా బయటికొచ్చింది. చిరంజీవి కొత్త ఇంటిలో జరిగిన తారల ఆత్మీయ కలయికలో వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్, సురేష్, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరుకాలేదు. ఆయన ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉండటంతో రాలేదట. మొత్తం మీద 37 మంది తారలు పాల్గొన్నారు. ప్రస్తుతం స్టార్స్ రీయూనియన్ చిరంజీవి కొత్త ఇంటిలో ...